Razole: రాజోలులో డంపింగ్ యార్డుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గ్రామానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు.

PRABHU, RAZOLE
Published on: 10 Aug 2026 10:54 PM IST
Razole
X

Razole: రాజోలులో డంపింగ్ యార్డుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే!

రాజోలు: రాజోలు గ్రామానికి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులతో కలిసి సోమవారం స్థల పరిశీలన చేశారు. HP గ్యాస్ కంపెనీ రోడ్డు శివారు ప్రాంతంలోని సర్వే నెంబర్లు 175, 176లో ఉన్న 2.58 ఎకరాల ప్రభుత్వ భూమిని డంపింగ్ యార్డు ఏర్పాటుకు పరిశీలించారు.

రాజోలు పట్టణానికి డంపింగ్ యార్డు లేకపోవడం చాలా కాలంగా ప్రధాన సమస్యగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వ భూమిని గుర్తించి పరిశీలించినట్లు చెప్పారు.

డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే ప్రాంతంలో మురికికాల్వపై ఉన్న వంతెన చుట్టూ ప్రహరీ నిర్మించడంతో పాటు, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రాజోలు గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంతో పాటు చెత్త నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని తెలిపారు. అవసరమైన అన్ని చర్యలను చేపడతామని స్పష్టం చేశారు. స్థల పరిశీలనలో సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story