Razole: మామిడికుదురులో డ్రైనేజీ ప్రతిపాదనల పరిశీలన!
Razole: రాజోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ తెలిపారు.
Razole: మామిడికుదురులో డ్రైనేజీ ప్రతిపాదనల పరిశీలన!
Razole: రాజోలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ తెలిపారు. గురువారం మామిడికుదురు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రధాన రహదారి పొడవునా డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి, పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు.
డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు.
కూటమి నాయకులతో కలిసి జరిగిన ఈ పరిశీలన కార్యక్రమంలో జి.పెదకాపు, ఈలి శ్రీనివాసరావు, కంచి విశ్వనాథం, బండారు వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు రుద్ర శ్రీనివాసరావు, ఇంటి మహేంద్ర, నైనాల సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.




