Malikipuram: మలికిపురంలో ఘనంగా తిరంగా సైకిల్ ర్యాలీ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!
Malikipuram: 80వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా మలికిపురంలో 'తిరంగా సైకిల్ ర్యాలీ'. ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.
Malikipuram: మలికిపురంలో ఘనంగా తిరంగా సైకిల్ ర్యాలీ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్!
Malikipuram: 80వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండల కేంద్రంలో గురువారం తిరంగా సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. మలికిపురం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆధ్వర్యంలో, ఎంపీడీఓ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
మలికిపురం సెంటర్‌లో నిర్వహించిన ర్యాలీలో సుమారు 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని విద్యార్థులు చేసిన నినాదాలతో మలికిపురం సెంటర్‌లో దేశభక్తి వాతావరణం నెలకొంది.
కార్యక్రమానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, నిర్వాహకులను అభినందించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మలికిపురం మండలానికి చెందిన వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




