Razole: అంగన్‌వాడీలకు యూనిఫార్మ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Razole: రాజోలు నియోజకవర్గంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు యూనిఫార్మ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. పోషకాహార పోస్టర్ల ఆవిష్కరణ.

PRABHU, RAZOLE
Published on: 2 Aug 2026 4:44 PM IST
Razole
X

Razole: అంగన్‌వాడీలకు యూనిఫార్మ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

రాజోలు: రాజోలు నియోజకవర్గం లోని అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫార్మ్స్‌ను మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా, శిశు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధి కోసం అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేస్తూ, వర్కర్లు, హెల్పర్లు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

నియోజకవర్గంలో 253 అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తున్నాయని, ప్రతి కేంద్రంలో ఒక టీచర్, ఒక ఆయా సేవలందిస్తున్నారని చెప్పారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు, 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక విద్య, ఆటల ద్వారా అభ్యాసం కల్పిస్తున్నట్లు వివరించారు.

3 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలను తల్లిదండ్రులు తప్పనిసరిగా సమీప అంగన్వాడి కేంద్రాలకు పంపించి ప్రభుత్వం అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం పౌష్టికాహారానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story