Razole: రాజోలు మండల అభివృద్ధికి ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రత్యేక దృష్టి

Razole: రాజోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

PRABHU, RAZOLE
Published on: 5 Jun 2026 7:26 PM IST
Razole
X

Razole: రాజోలు మండల అభివృద్ధికి ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రత్యేక దృష్టి

Razole: రాజోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వ సభ్య సాధారణ సమావేశానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మండల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మండలంలోని కాలువల పూడికతీత, మట్టి తొలగింపు పనులను వేగవంతం చేసి సాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాలువలకు నిరంతరం నీరందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మంచినీటి సమస్యల పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొనసాగుతోందని, చింతలపల్లి, శివకోడు ప్రాంతాల్లో కొత్త నీటి ట్యాంకుల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే, లో-వోల్టేజ్ సమస్యల నివారణకు ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు చేపడుతున్నామని, శివకోడు సబ్‌స్టేషన్‌లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాజోలు డంపింగ్ యార్డ్ అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణ పనులు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ రహదారుల మరమ్మతులు, గుంతల పూడ్చివేత, కొత్త రహదారుల నిర్మాణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మండల పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story