Razole: గోశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Razole: రాజోలు గోశాలలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్నారులతో ఉట్టి కొట్టించే కార్యక్రమం నిర్వహించి, వేషధారణ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

PRABHU, RAZOLE
Published on: 4 Sept 2026 8:54 PM IST
Razole
X

Razole: గోశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రాజోలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని గోశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

చిన్నారులతో ఉట్టి కొట్టించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉట్టి కొట్టిన చిరంజీవి పాటి నిహాల్‌ ను అభినందించి ప్రత్యేక బహుమతిని అందజేశారు. అలాగే చక్కటి వేషధారణతో పాల్గొన్న చిన్నారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి చిన్నారికి కూడా బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షులు దార్ల పెదబాబు, సెక్రటరీ అక్కిరెడ్డి సుబ్రమణ్యం, ట్రెజరర్ రేఖపల్లి నాగబాబు, రాజా నాగరత్నకుమార్, నూలు శ్యామల, కొత్త పద్మావతి, జొన్నలగడ్డ గోపాలకృష్ణ, నిరంజన్ రావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు కూడా కార్యక్రమంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story