Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర వేడుకలు
Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు. ప్రతిభావంతులకు బహుమతులు.
Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర వేడుకలు
రాజోలు: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గౌరవాన్ని చాటారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. తమ కళాశాల ఇతర కళాశాలలు, విభాగాలకు భిన్నంగా ప్రత్యేకతను చాటుకుంటోందన్నారు.
కళాశాలలో ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు అందించిన ఆర్థిక విరాళాలతో సమకూరిన రూ.1.20 లక్షలను ఎండోమెంట్ బహుమతులుగా అందజేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్. రాజు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




