Razole: చిన్నారి హృదయ శస్త్రచికిత్సకు 'ఫ్రెండ్స్ ఫర్ సర్వీస్' రూ. 70 వేల ఆర్థిక సాయం
Razole: కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెంకు చెందిన చిన్నారి ఫ్యాన్నీ గ్లాన్ హార్ట్ సర్జరీ కోసం 'ఫ్రెండ్స్ ఫర్ సర్వీస్' రాజోలు సభ్యులు రూ. 70,000 ఆర్థిక సాయం అందజేశారు.
Razole: చిన్నారి హృదయ శస్త్రచికిత్సకు 'ఫ్రెండ్స్ ఫర్ సర్వీస్' రూ. 70 వేల ఆర్థిక సాయం
రాజోలు: డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంకు చెందిన ఇంజెటి సుజికర్ కుమార్తె ఫ్యాన్నీ గ్లాన్ హార్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని వైద్యులు సూచించారు.
చికిత్సకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుండటంతో విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్ ఫర్ సర్వీస్ – రాజోలు నియోజకవర్గం సభ్యులు ఆర్థిక సాయం అందించారు.
తెలుగు క్రిస్టియన్ వర్షిప్ చర్చ్, ఇజ్రాయిల్ తరఫున రూ.30,000, కుసుమ చరణ్ విజయభారతి ద్వారా రూ.30,000, కొల్లాబత్తుల స్టీవెన్ రూ.5,000, బొడ్డపల్లి మనోజ్ కుమార్ రూ.5,000 చొప్పున మొత్తం రూ.70,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ మొత్తాన్ని కుసుమ మున్నా, కుసుమ చరణ్, సహదేవ్ తాడి, ఈద జోసెఫ్ చేతుల మీదుగా చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ సర్వీస్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.




