Razole: పంట పొలాల మధ్య రొయ్యల సాగు రద్దు చేయాలని రైతుల నిరసన!
Razole: రాజోలు ఫిషరీస్ కార్యాలయం వద్ద లక్కవరం రైతుల నిరసన. పంట పొలాల మధ్య రొయ్యల సాగు, ఉప్పునీటి బోర్ల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్.
Razole: పంట పొలాల మధ్య రొయ్యల సాగు రద్దు చేయాలని రైతుల నిరసన!
Razole: పంట పొలాల మధ్య రొయ్యల సాగుకు ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని, అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఉప్పునీటి బోర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన వ్యవసాయ రైతులు నిరసన చేపట్టారు.
లక్కవరం గ్రామం నుంచి రైతులు మోటార్‌సైకిళ్లపై ర్యాలీగా రాజోలు ఫిషరీస్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
అనంతరం సంబంధిత మత్స్యశాఖ అధికారికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రైతులు అందజేశారు. పంట పొలాల మధ్య రొయ్యల సాగు వల్ల వ్యవసాయానికి, కొబ్బరి తోటలకు, భూగర్భ జలాలకు నష్టం కలిగే అవకాశం ఉందని ఇప్పటికే 60 బస్తాలు పండే పంటలు 10,15 బస్తాలుకే పరిమితమయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఉప్పునీటి బోర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.




