Razole: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
Razole: రాజోలు డిగ్రీ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్ డా. పి. సాయి బాబు ఆధ్వర్యంలో లెక్చరర్లను సన్మానించారు.
Razole: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
రాజోలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సాయి బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేటి విద్యార్థులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. గురువులకు గురువుగా, సద్గురువుగా ఆయనను కొనియాడారు.
మహా వేదాంతిగా, రాజనీతిజ్ఞుడిగా, విద్యావేత్తగా దేశానికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉపాధ్యాయులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని హితవు పలికారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కళాశాలలోని ప్రతి లెక్చరర్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఉపప్రిన్సిపాల్ శ్రీ నల్లి రాజు, డా. లావణ్య, శ్రీ గోపాల్ కృష్ణ, శ్రీ చిన సత్యనారాయణతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




