Razole: హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి: దళిత సంఘాల జేఏసీ!
Razole: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోనసీమ కలెక్టర్, ఎస్పీలకు దళిత సంఘాల జేఏసీ ఫిర్యాదు చేసింది.
Razole: హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి: దళిత సంఘాల జేఏసీ!
రాజోలు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసత్య ప్రచారం చేస్తున్న తెలంగాణకు చెందిన హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంబేడ్కర్‌పై చేస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ బయట హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాలమహానాడు అధ్యక్షులు బొంతు మణిరాజు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, వీసీకే పార్టీ రాష్ట్ర నాయకులు బొంతు వెంకట రమణ, దళిత చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, ఎస్సీ సంక్షేమ సంఘం రాజోలు మండల అధ్యక్షులు మట్టా సురేష్ కుమార్, మాలల న్యాయపోరాట సమితి జేఏసీ మామిడికుదురు మండల అధ్యక్షులు మట్టా సత్తిబాబు, దళిత చైతన్య వేదిక రాజోలు మండల అధ్యక్షులు మందపాటి మధు, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యనిర్వాహక సభ్యులు పుల్లెళ్ల ఆనంద్, న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు మార్లపూడి దొరబాబు, బొంతు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.




