Razole: కోర్టులో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన జడ్జి!

Razole: రాజోలు న్యాయస్థాన ప్రాంగణంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటిన ఇంచార్జి సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నప్రసాద్.

PRABHU, RAZOLE
Published on: 15 Aug 2026 5:23 PM IST
Razole
X

Razole: కోర్టులో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన జడ్జి!

Razole: రాజోలు న్యాయస్థాన సముదాయ ప్రాంగణంలో (కోర్టు ప్రాంగణంలో) 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గౌరవాన్ని చాటారు.

ఈ సందర్భంగా జడ్జి కె. రత్నప్రసాద్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.అనంతరం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వనమహోత్సవంలో భాగంగా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు.

కార్యక్రమంలో బెంచ్ మేజిస్ట్రేట్ శాంతిప్రియ, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు యాలంగి రమేష్, కార్యదర్శి వై.ఏడుకొండలు, సీనియర్ న్యాయవాది పాపయ్యపంతులు మరియు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story