Razole: అరవపాలెంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించిన చిన్నారులు!

Razole: అరవపాలెంలో చిన్నారుల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు. స్వయంగా విగ్రహాన్ని ప్రతిష్టించి, భజనలు చేస్తూ ప్రసాదాలు పంపిణీ చేసిన పిల్లలు.

PRABHU, RAZOLE
Published on: 15 Sept 2026 8:25 AM IST
Razole
X

Razole: అరవపాలెంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించిన చిన్నారులు!

Razole: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని అరవపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన చిన్నారులంతా కలిసి స్వయంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ఉదయం నుంచే స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం పందిరి వద్ద పిల్లలంతా ఒకచోట చేరి భక్తిశ్రద్ధలతో భజనలు, కీర్తనలు ఆలపించారు. దీంతో పూజా ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

పూజా కార్యక్రమాల అనంతరం చిన్నారులే స్వయంగా భక్తులకు, గ్రామస్థులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. పండుగను ఎంతో ఉత్సాహంగా, ఐకమత్యంతో నిర్వహిస్తూ చిన్నారులు చూపిన భక్తిభావం స్థానికులను ఆకట్టుకుంది.

చిన్న వయసులోనే సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పట్ల ఆసక్తి పెంచుకుంటూ వినాయక చవితి వేడుకలను నిర్వహించిన చిన్నారులను గ్రామ పెద్దలు, స్థానికులు అభినందించారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి సంప్రదాయాలను కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE