Ravulapalem: వైయస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహణ

Ravulapalem: రావులపాలెంలో వైయస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ బలోపేతం, రాబోయే మున్సిపల్ ఎన్నికలపై నేతలు దిశానిర్దేశం చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 8 Sept 2026 6:12 PM IST
Ravulapalem
X

Ravulapalem: వైయస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహణ

రావులపాలెం: రావులపాలెంలో ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో,జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రివర్యులు,అమలాపురం పార్లిమెంట్ కోఆర్డినేటర్, P.A.C. సభ్యులు పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

అలాగే రాబోయే మున్సిపల్ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డులో పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు,బొమ్మి ఇజ్రాయేల్,కుడిపూడి సూర్యనారాయణ రావు,P.A.C సభ్యులు పిల్లి బోస్,మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణు,గొల్లపల్లి సూర్యారావు,అమలాపురం పార్లిమెంట్ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి,మాజీ శాసనసభ్యులు పొన్నాడ సతీష్,నియోజకవర్గ కో ఆర్డినేటర్లు రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు,వంటెద్దు వెంకన్నాయుడు,అమలాపురం పరిశీలకులు కటకంశెట్టి ఆదిత్య,మరియు రాష్ట్ర,జిల్లా అనుబంధ విభాగ సభ్యులు,నాయకులు కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story