Antarvedi: అంతర్వేది హార్బర్‌లో వలకు చిక్కిన భారీ హనుమాన్ సొర

Antarvedi: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్‌లో అరుదైన భారీ చేపలు మత్స్యకారుల వలకు చిక్కాయి.

PRABHU, RAZOLE
Published on: 18 July 2026 9:35 AM IST
Antarvedi
X

Antarvedi: అంతర్వేది హార్బర్‌లో వలకు చిక్కిన భారీ హనుమాన్ సొర

అంతర్వేది: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ మినీ హార్బర్ కేంద్రంగా శుక్రవారం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ చేపలు చిక్కాయి. సుమారు 50 కిలోల బరువున్న అరుదైన 'హనుమాన్ సొర' చేప వలలో చిక్కింది.

హార్బర్‌కు తీసుకొచ్చిన ఈ చేపను నిర్వహించిన బహిరంగ వేలంలో పాటదారుడు రూ.12 వేలకు దక్కించుకున్నారు. అలాగే, 50 కిలోల బరువున్న 'టేకు చేప' కూడా మత్స్యకారుల వలలో పడగా, బహిరంగ వేలంలో రూ.8 వేల ధర పలికింది.

భారీ పరిమాణంలో అరుదైన చేపలు లభించడంతో హార్బర్ వద్ద స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ చేపలు మంచి ధర పలకడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story