Koonavaram: కూనవరంలో అరుదైన నాణేలు, పాత కరెన్సీ నోట్ల ప్రదర్శన
Koonavaram: రాజోలు నియోజకవర్గం కూనవరం నాగసూర్య స్కూల్లో రాచరిక కాలం నాటి నాణేలు, అరుదైన పాత కరెన్సీ నోట్ల ప్రదర్శన విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది.
Koonavaram: కూనవరంలో అరుదైన నాణేలు, పాత కరెన్సీ నోట్ల ప్రదర్శన
కూనవరం (రాజోలు): డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం కూనవరంలోని నాగసూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ప్రాచీన, అరుదైన కరెన్సీ నోట్లు, నాణేల ప్రదర్శన నిర్వహించారు.
పాఠశాల కరస్పాండెంట్ వానరసి మారుతి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో రాచరిక కాలం నాటి నాణేలు, రాగి కాసులు, అణాలు, బేడలతో పాటు స్వాతంత్ర్యానికి పూర్వం, అనంతరం చలామణిలో ఉండి ప్రస్తుతం కనుమరుగైన పాత తరం కరెన్సీ నోట్లను ప్రదర్శించారు.
దేశ ఆర్థిక చరిత్ర, కాలానుగుణంగా ద్రవ్య రూపాల్లో వచ్చిన మార్పులను విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. పుస్తకాల్లో చదివిన పాత నాణేలు, నోట్లను నేరుగా చూసే అవకాశం కలగడం తమకు ఎంతో ఆసక్తికరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.
ప్రాచీన చారిత్రక సంపద, దేశ ద్రవ్య చరిత్రపై విద్యార్థులకు చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు కరస్పాండెంట్ మారుతి ఈశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




