Rampachodavaram: CEIR పోర్టల్ ద్వారా రూ. 2.50 లక్షల విలువైన ఫోన్లు రికవరీ!
Rampachodavaram: రంపచోడవరం సబ్ డివిజన్ పరిధిలో CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 20 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన ఐపీఎస్ జావళి ఆల్ఫోన్స్.
Rampachodavaram: CEIR పోర్టల్ ద్వారా రూ. 2.50 లక్షల విలువైన ఫోన్లు రికవరీ!
Rampachodavaram: రంపచోడవరం సబ్-డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు పోగొట్టుకున్న మరియు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా CEIR (Central Equipment Identity Register) పోర్టల్ సహాయంతో గుర్తించి రికవరీ చేసిన 20 స్మార్ట్ మొబైల్ ఫోన్లను రంపచోడవరం సబ్-డివిజన్ పోలీసులు, వాటిని అసలైన యజమానులకు అందజేశారు.
రంపచోడవరం సబ్-డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలువురు పౌరులు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు లేదా చోరీకి గురైనట్లు ఫిర్యాదులు చేయగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. CEIR పోర్టల్ మరియు ఇతర సాంకేతిక ట్రాకింగ్ విధానాల ద్వారా మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు.
ఈ విధంగా రికవరీ చేసిన మొత్తం 20 మొబైల్ ఫోన్లను, సుమారు రూ. 2,50,000 /- విలువైన వాటిని, స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు పోలవరం జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ (OSD) Ms. Jaavali Alfons IPS మరియు రంపచోడవరం డీఎస్పీ/ఎస్‌డీపీఓ శ్రీ P అష్రఫ్ అలీ గారి చేతుల మీదుగా అందజేశారు.
తాము పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ రంపచోడవరం సబ్-డివిజన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ (OSD) గారి సూచనలు.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, CEIR పోర్టల్ ద్వారా ఫోన్ యొక్క IMEI నంబర్ వివరాలతో మొబైల్‌ను బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
అలాగే, గుర్తుతెలియని వ్యక్తుల వద్ద నుండి తక్కువ ధరకు లభిస్తున్నాయని భావించి, బిల్లు లేదా సరైన ధృవీకరణ పత్రాలు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. అవి చోరీ సొత్తుగా తేలితే సంబంధిత వ్యక్తులు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాలు మరియు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్-డివిజన్ పరిధిలోని రంపచోడవరం సీఐ T G N ప్రసాద్ గారు రంపచోడవరం ఎస్సై P రమేష్ దేవీపట్నం ఎస్సై K షరీఫ్ పోలీస్ సిబ్బంది మరియు బాధితులు పాల్గొన్నారు.




