Rampachodavaram: రంపచోడవరంలో ఘనంగా పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు!

Rampachodavaram: రంపచోడవరంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు; కుర్ల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఆసుపత్రి రోగులకు పండ్లు, పాలు పంపిణీ.

Prasanna, Rampachodavaram
Published on: 2 Sept 2026 1:31 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: రంపచోడవరంలో ఘనంగా పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు!

Rampachodavaram: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో అంబరాన్ని అంటాయి. జనసేన నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ముందుగా స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారీగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేసి తమ అభిమాన నేత జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పోలవరం జిల్లా నలుమూలల నుంచి జనసేన నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story