Rajanagaram: మాటల్లో పెట్టి నగలు కొట్టేసే ఇద్దరు మహిళల అరెస్ట్!

Rajanagaram: రాజానగరం పోలీసులు ఘరానా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు కిలాడీ మహిళలను అరెస్ట్ చేశారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 21 Jun 2026 8:41 PM IST
Rajanagaram
X

Rajanagaram: మాటల్లో పెట్టి నగలు కొట్టేసే ఇద్దరు మహిళల అరెస్ట్!

Rajanagaram: మనతో ప్రయాణం చేస్తూ మాటల్లో పెట్టి దొంగతనాలు పాల్పడుతున్న ఇద్దరు కిలాడీ మహిళలను రాజానగరం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుండి రూ.4 లక్షల 85 వేలు విలువైన వెండి బంగారం వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీస్ స్టేషన్ లో నార్త్ జోన్ డిఎస్పీ సిహెచ్ జీవన, సిఐ ఎస్. ప్రసన్న వీరయ్య గౌడ్ నిందితులతో వివరాలు తెలిపారు.

ఏప్రిల్ 13వ తేదీన కొంతమూరు చెందిన పసల బేబీ బంగారం, వెండి వస్తువులు బ్యాగ్ లో పెట్టుకుని గండేపల్లి మండలం మురారి వెళ్లడానికి రాజమహేంద్రవరం కంబాల చెరువు సెంటర్లో ఆటో ఎక్కింది. మార్గమధ్యం దివాన్ చెరువులో ఇద్దరు మహిళలు ఆటోఎక్కి పసల బేబీని మాటల్లో పెట్టి బ్యాంగ్ తో పరారైనారు. దీనిలో సుమారు 176 గ్రాములు బంగారం, వెండి 197 గ్రాములు వస్తువులు ఉన్న బ్యాంగ్ దొంగిలించారని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కొంతమూరులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గోకవరం చెందిన , ఇద్దరు మహిళలు కంగారుగా పారిపోవడానికి ప్రయత్నించాగా పట్టుకుని విచారణ చేశారు. వీరు ఏప్రిల్ 13వ తేదీన ఆటోలో దొంగతనం చేసామని అంగీకరించడంతో నిందితుల నుండి 176.470 గ్రాముల చైన్, బ్రాస్లెట్, రింగ్స్ తదితర బంగారం వస్తువులు, 197.300 గ్రాముల వెండి వస్తువులు మెలతాడు, పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశామని డిఎస్పీ సిహెచ్ జీవన తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసిన ఎస్ఐ మురళీ కృష్ణ సిబ్బందిని డిఎస్పీ,సిఐ అభినందించారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story