Rajamahendravaram: దుళ్లలో మెగా మెడికల్ క్యాంప్‌నకు విశేష స్పందన: డా. రవిరామ్ కిరణ్
Rajamahendravaram: రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం దుళ్లలో భారత్ టీమ్, ధరణి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
Rajamahendravaram: దుళ్లలో మెగా మెడికల్ క్యాంప్‌నకు విశేష స్పందన: డా. రవిరామ్ కిరణ్
Rajamahendravaram: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం దుళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారత్ వారి టీమ్ ఆధ్వర్యంలో, ధరణి హాస్పిటల్ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ధరణి హాస్పిటల్‌కు చెందిన వివిధ విభాగాల వైద్య నిపుణులు, నర్సింగ్, ఫార్మసీ సిబ్బంది పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేశారని చెప్పారు.వాస్క్యులర్ సర్జన్, సర్జికల్ ఆంకాలజిస్ట్ వంటి సూపర్ స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొనడం ఈ శిబిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు.
“ఆరోగ్యమే నిజమైన సంపద” అని పేర్కొంటూ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్యం పొందాలని ప్రజలకు సూచించారు. అనంతరం స్థానిక కూటమి నాయకులు, హాస్పిటల్ యాజమాన్యం డా. రవిరామ్ కిరణ్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు.గుర్రపు సత్యనారాయణ (కొండయ్య మాస్టర్) దుళ్ళ తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు, సూరపరెడ్డి భరత్, తూము శ్రీను, కంటిపూడి శ్రీనివాస్, దొంతంశెట్టి నూకరాజు, మెర్ల అయ్యప్ప, చిట్టూరి వెంకన్న చౌదరి, గుత్తి సత్యనారాయణమూర్తి, తోకల వీర రాంబాబు, గ్రంధి వెంకయ్య,నూలు నాగేశ్వరరావు, చిట్టూరి అమ్మి రాజు,గుత్తి బూడిద వీరబ్రహ్మం, గుర్రపు కృష్ణ, దొంతంశెట్టి సూర్య ప్రకాష్, పత్తి సూర్యప్రకాష్, కంటిపూడి రామకృష్ణ, సిద్దిన త్రివేణి, చిల్లి రాజబాబు చైతన్య, నక్క సురేష్, గుర్రపు నరేంద్ర కిరణ్, నూలు కోటేశ్వరరావు,మరియు ఆర్ఎంపీలు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.




