Rajahmundry: పేపర్ మిల్లు కాలుష్యంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆందోళన

Rajahmundry: రాజమండ్రిలో పేపర్ మిల్లు కాలుష్యంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాసు ఆందోళన వ్యక్తం చేసి, పుష్కరాల నాటికి మిల్లును మూసివేయాలని డిమాండ్ చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 9 Sept 2026 11:35 PM IST
Rajahmundry
X

Rajahmundry: పేపర్ మిల్లు కాలుష్యంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆందోళన

రాజమండ్రి: ప్రభుత్వం హామీ ఇచ్చి నట్టుగా వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు కాలుష్య రహిత, పవిత్ర స్నానాలు భక్తులకు సాధ్యం కాదనే అనుమానాలు కలుగుతున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాసు ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా పేపర్ మిల్లు కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు జరుగుతున్న ప్పటికీ గత ప్రభుత్వాల్లో స్పందన కరువైందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గత మే నెలలో ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పేపర్ మిల్లు కాలుష్య , విషరసాయనాలను నిర్ధారించారని అన్నారు. అయితే మూడు నెలలు గడుస్తున్నప్పటికీ పేపర్ మిల్లు పై ఎటువంటి శాఖ పరమైన చర్యలు లేవని విమర్శించారు.

స్థానిక సంస్థలకు రూ .32 కోట్ల పన్ను బకాయిలు చెల్లించ డం లేదన్నారు. సామాన్యులుపన్ను బకాయిలు చెల్లించకపోతే విరుచుకుపడే అధికార యంత్రాంగం మిల్లు పట్ల ఎందుకు సానుభూతి చూపుతున్నారని ప్రశ్నించారు. మిల్లు కాలుష్యం పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన రూ 21కోట్ల రూపాయలు వసూళ్లు చేయకపోవడం ప్రభుత్వ అసమర్ధత ఉందన్నారు. గోదావరి పుష్కరాల పై కాలుష్య రహిత జలాల కోసం, భక్తుల భద్రత కోసం చేపట్టవలసిన చర్యలపై పార్టీ ప్రభుత్వానికి నివేదిక పంపించిందన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన తర్వాత మిల్లు కాలుష్యం 95 శాతం వరకు పెరిగిందని, కొత్తగా టిష్యూ పేపర్ ఉత్పత్తికి అనుమతులు ఇవ్వడమే అందుకు కారణమన్నారు. పేపర్ మిల్లు కాలుష్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో జూన్ నెలలో చేసిన ఫిర్యాదు పై చర్యలు లేవన్నారు. ఉపముఖ్యమంత్రి పరిశీలనకు, చర్యలకు కుటమి ప్రభుత్వం లో విలువ లేదా ప్రశ్నించారు.

గోదావరి పుష్కరాలకు మూడు నెలలు ముందు మిల్లును మూసివేయాలని, వాటర్ పంపిణీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాలకు కేంద్ర , రాష్ట్ర, సి ఎస్ ఆర్ నిధులు లభ్యత వ్యయ్యాలపై నగర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చారిత్రాత్మక నగరానికి రాజమహేంద్రవరం స్థానంలో రాజమహేంద్రి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్పిసి నాయకులు పెండ్యాల కామరాజు, దుర్గా ప్రసాద్, మాస ప్రసాద్ , దొడ్డి ప్రసాదు, బస సౌమ్య, సాయి, శర్మ తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story