Kadiyam: ఎంపీ పురందేశ్వరిని కలిసిన కడియం నర్సరీ అసోసియేషన్ నూతన పాలకవర్గం!
Kadiyam: రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు బొర్సు సుబ్బారాయుడు & పాలకవర్గం.
Kadiyam: ఎంపీ పురందేశ్వరిని కలిసిన కడియం నర్సరీ అసోసియేషన్ నూతన పాలకవర్గం!
Kadiyam: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికలు 2026 లో ఎన్నికైన నూతన అధ్యక్షులు శ్రీ బొర్సు సుబ్బారాయుడు మరియు పాలక వర్గ సభ్యులు ఈరోజు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుపాటి పురందేశ్వరి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
అనంతరం అసోసియేషన్ నూతన అధ్యక్షులు బోర్సు సుబ్బారాయుడు కడియం నర్సరీ రంగం అభివృద్ధి కి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించాలని కోరారు కడియం నర్సరీ రంగం ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని వివరించారు.
అలాగే కడియం నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి 3 ఫేజ్ కరెంట్ సోలార్ లు సబ్సిడీ నర్సరిరైతు అందించాలని అదేవిధంగా ఎర్ర మట్టి విషయంలో విజేలెన్స్ పర్మిషన్స్ గురించి చర్చించారు నర్సరీ రంగానికి తమ సహకారం కావాలని నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు బోర్సు సుబ్బారాయుడు కోరడం జరిగినది.
గౌరవ ఎంపి సానుకూలంగా స్పందిస్తూ నర్సరీ రైతుల అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమం లో బోర్సు సుబ్బారాయుడు , తాడాల సత్యనారాయణ , పాఠంశెట్టి శ్రీను వాసు , పుల్లా శ్రీను ,గట్టా కృష్ణ భగవాన్ ,సానా రాజు ,కామిశెట్టి వెంకటేష్ , డేగల రాము ,అన్నందేవుల వెంకటేశ్వర్రావు , బోడపాటి చంద్రశేఖర్ శ్రీనివాస్ ,దూలం సత్యనారాయణ మూర్తి , బొర్సు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.




