Rajahmundry: సీవీఏపీయూ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష
Rajahmundry: రాజమండ్రిలో సీవీఏపీయూ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజా దర్బార్, పీ4 కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Rajahmundry: సీవీఏపీయూ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష
రాజమండ్రి: రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ఈ రోజు నియోజకవర్గ స్థాయి విజన్ అండ్ యాక్షన్ ప్లాన్ (CVAPU) కార్యాలయాన్ని సందర్శించి, అధికారులు మరియు సిబ్బందితో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజా దర్బార్ (PGR), P4 కార్యక్రమాల పురోగతి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPIs) ఆధారంగా నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలు, అధికారుల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు.
అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన ‘స్వర్ణ రాజమహేంద్రవరం’ సిటీ మాస పత్రికను పరిశీలించారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రోజువారీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
అలాగే పై అంశాలపై రేపు సంబంధిత అధికారులతో CVAPU కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.




