Rajahmundry: కమ్యూనిటీ హాల్ పనులను త్వరగా పూర్తి చేయాలి!
Rajahmundry: 13వ డివిజన్‌లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటన. రూ. 17 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ పనుల పరిశీలన, అధికారులకు స్పష్టమైన సూచనలు.
Rajahmundry: కమ్యూనిటీ హాల్ పనులను త్వరగా పూర్తి చేయాలి!
Rajahmundry: స్థానిక 13వ డివిజన్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హాల్ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్‌లో చేపట్టిన ఆధునీకరణ పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
భవనంలో చేపట్టిన పనుల పురోగతిపై నగర పాలక సంస్థ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్‌ను ప్రజలకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న ఆధునీకరణ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
కాగా ఆధునీకరణ పనుల్లో భాగంగా ఇప్పటికే సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఎలక్ట్రికల్ వైరింగ్, లైటింగ్, పెయింటింగ్, నేమ్‌బోర్డు తదితర పనులు చేపట్టారు. అలాగే కమ్యూనిటీ హాల్ చుట్టూ రూ.10 లక్షల వ్యయంతో కాంపౌండ్ వాల్‌కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు గేట్లకు రేకులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా మరో రూ.2 లక్షలతో మిగిలిన అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది.
కమ్యూనిటీ హాల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే డివిజన్ ప్రజలకు వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు మరింత సౌకర్యం కలుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా నగర పాలక సంస్థ అధికారులు కమ్యూనిటీ హాల్‌లో చేపట్టిన పనులు, ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఎమ్మెల్యే వాసుకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొల్లి బుజ్జి, కప్పల వెలుగు కుమారి, నగరబోయిన రామకృష్ణ, బొర్రా చిన్ని, వై దేవి వరప్రసాద్, మండా నారాయణ, చెల్లుబోయిన మూర్తి, వీర్రాజు, శెట్టి అప్పారావు, పొలవరపు సోమరాజు, రాము, తూటా రాజేష్, తోట సుబ్రహ్మణ్యం తదితరులతో పాటు స్థానిక మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.




