Rajahmundry: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పారదర్శకతతో పరిష్కరించాలి.. కమిషనర్!

Rajahmundry: రాజమండ్రిలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు, ఐపిఎల్పీలను కమిషనర్ రాహుల్ మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తులను గడువులోగా పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశం.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 8 Sept 2026 3:27 PM IST
Rajahmundry
X

Rajahmundry: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పారదర్శకతతో పరిష్కరించాలి.. కమిషనర్!

Rajahmundry: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పారదర్శకతతో పరిష్కరించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. మంగళవారం ఉదయం ఏవీఏ రోడ్డు, జేఎన్ రోడ్డు, తారకరామ నగర్ సహా పలు ప్రాంతాలలో పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి పర్యటించారు.

క్షేత్రస్థాయిలో ఇన్ ప్రిన్సిపుల్ లేఅవుట్ ప్యాట్రన్(ఐపిఎల్పీ)లను తనిఖీ చేసి, పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. ప్రతి దరఖాస్తును అత్యంత జాగ్రత్తగా పరిశీలించి, ఏవైనా లోపాలు లేదా అభ్యంతరాలు ఉంటే.. స్పష్టమైన వివరాలతో రిమార్క్స్ నోట్ చేసి తదుపరి అనుమతుల కోసం పంపాలని స్పష్టం చేశారు.

దరఖాస్తులను క్రమబద్ధీకరించే క్రమంలో ‘ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్’ (ముందు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత) విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని.. ఎక్కడా జాప్యానికి తావు ఉండకూడదని పేర్కొన్నారు. అలాగే రోడ్డు విస్తరణల కోసం వదిలేసిన స్థలాలలో ఎటువంటి నిర్మాణాలు కానీ, ఆక్రమణలు కానీ లేకుండా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఏసీపీ కొండలరావు, ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story