Rajahmundry: రాజమండ్రిలో 29,880 మంది ఓటర్లకు బీఎల్ఓల నోటీసులు కమిషనర్!
Rajahmundry: రాజమండ్రిలో పారదర్శక ఓటర్ల జాబితా తయారీపై బి.ఎల్.ఓ.లు, సూపర్‌వైజర్లకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, కమిషనర్ రాహుల్ మీనా ప్రత్యేక శిక్షణ.
Rajahmundry: రాజమండ్రిలో 29,880 మంది ఓటర్లకు బీఎల్ఓల నోటీసులు కమిషనర్!
Rajahmundry: పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీలో సూపర్ వైజర్లు, బూత్ లెవల్ అధికారులు(బి.ఎల్.ఓ.లు) జాగ్రత్తగా వ్యవహరించాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్ నందు ఏఈఆర్ఓలు, బి.ఎల్.ఓ.లు, సూపర్‌వైజర్‌లకు డ్రాఫ్ట్ రోల్ తరువాత చేయు కార్యాచరణపై సోమవారం ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముసాయిదాకు ముందు కాలంలో, 2025 తుది ఓటర్ల జాబితాలోని ఓటర్లను 2002 ఓటర్ల జాబితాతో మ్యాప్ చేయడం జరిగిందని తెలిపారు. మ్యాపింగ్ కాని మరియు తార్కిక వ్యత్యాసాల వర్గం (Logical Discrepancies) కిందకు వచ్చే ఓటర్లు అర్బన్ పరిధిలో 29,880 మందిని గుర్తించటం జరిగిందన్నారు.
వీరందరికీ ఇంటింటికి వెళ్లి బీఎల్ఓలు నోటీసులు ఇవ్వవలసి ఉంటుందన్నారు. అలాగే విచారణల కోసం వేర్వేరు షెడ్యూల్ తేదీలను నిర్ణయించామని తెలిపారు. నోటీసులను జారీ చేయడం, ఓటర్ల వ్యక్తిగత హాజరు కోసం విచారణలను షెడ్యూల్ చేయడం మరియు అవసరమైన పత్రాలను అందించడం గురించి వివరించారు. పలు సందేహాలను నివృత్తి చేశారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎమ్మార్వో రంజిత్ కుమార్, ఇతర ఏఈఆర్ఓలు, సూపర్ వైజర్లు, బీఎల్ఓలు పాల్గొన్నారు.




