Razole: విజయవాడ డీఆర్ఎంకు రైల్వే అసోసియేషన్ విజ్ఞప్తి
Razole: నరసాపురం - కోటిపల్లి కొత్త రైల్వే మార్గాన్ని అంతర్వేది మీదుగా పొడిగించాలని గోదావరి రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ విజయవాడ డీఆర్ఎంకు విజ్ఞప్తి చేసింది.
Razole: విజయవాడ డీఆర్ఎంకు రైల్వే అసోసియేషన్ విజ్ఞప్తి
Razole: ప్రతిపాదిత కొత్త రైల్వేమార్గం (నరసాపురం - కోటిపల్లి - కాకినాడ) అలాగే అంతర్వేది మీదుగా మార్పు లేదా పొడిగింపు కోరుతూ ఈరోజు డిఆర్ఎ విజయవాడ వారికి గోదావరి జిల్లాల రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తిచేశారు.నరసాపురం నుండి కోటిపల్లి మీదుగా కాకినాడ వరకు కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయానికి తాము ఎంతో కృతజ్ఞులం అన్నారు.
భారతదేశం లోని వివిధ ముఖ్య నగరాలను అనుసంధానిస్తూ, ప్రయాణికులు, భక్తులు మరియు వ్యాపారవేత్తల అవసరాలను తీర్చే ఈ నిర్ణయం, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, మచిలీపట్నం, నరసాపురం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ మరియు కాకినాడ జిల్లాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అన్నారు.
ఇది నిజంగా ప్రశంసనీయం మరియు ప్రోత్సాహకరం అన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యా ణ్ ఆశయాలకు అనుగుణంగా అంతర్వేది లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాముఖ్యతను వారు అనేక సందర్భాల్లోను, పలు సమావేశాల్లోను
ప్రత్యేకంగా ప్రస్తావించి, ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయం అన్నారు. స్థానిక ప్రాంతాల నుండే కాకుండా, వివిధ నగరాల నుండి వచ్చే భక్తులందరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సిఉంది కాబట్టి.. బ్రిటిష్ కాలం నుండి స్థానికులు ఎదురుచూస్తున్న ఆకాంక్షలను నెరవేర్చాలని సాదరంగా కోరుతున్నామన్నారు.
అంతర్వేది గ్రామంలోనే ఒక విశిష్టమైన రైల్వే స్టేషన్ను నిర్మించడం ద్వారా, పైవిషయాన్ని అమలు చేసి, భక్తుల చిరకాల డిమాండ్ ను మరియు స్థానికుల అవసరాలను తీర్చడానికి ఇదేసరైన సమయం అన్నారు. అంతర్వేదిలో రైల్వే స్టేషన్ను నిర్మించడం వల్ల ప్రభుత్వానికి మరియు ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలను ఈ సందర్భంగా తెలియజేశారు.
1) ఈ ప్రాంతం ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని,..
2) మత్స్య ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం అభివృద్ధి చెందుతుందని,..
3) భక్తులకు ప్రయాణం సౌకర్యవంతంగా మారి, తీర్థయాత్రల అభివృద్ధికి దోహదపడుతుందని,..
4) కొబ్బరిపరిశ్రమల వృద్ధికి మార్గం సుగమమవుతుందని,..
5) లక్షలాదిమంది ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరియు అనుసంధానత లభిస్తుందని,..
6) రాబోయే పవిత్ర గోదావరి పుష్కరాల మహోత్సవానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు.
ప్రస్తుతం ప్రతిపాదించిన రైల్వే స్టేషన్ ఆలయానికి చాలా దూరంలో ఉందని,దీనివల్ల భక్తులు ఆలయానికి చేరుకోవడంలో రవాణా పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాబట్టి ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను వారు మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు.ఈ విన్నపాన్ని సానుకూలంగా పరిశీలించవలసినదిగా భారతదేశ గౌరవ ప్రధానమంత్రి కి, రైల్వే
మంత్రిత్వశాఖకు, అలాగే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.




