Rajahmundry: అభివృద్ధి పనులను కాపాడుకోవాలి: కమిషనర్ రాహుల్ మీనా!
Rajahmundry: రాజమండ్రి బాలాజీపేటలో దెబ్బతిన్న రోడ్డును మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా పరిశీలించారు.
Rajahmundry: అభివృద్ధి పనులను కాపాడుకోవాలి: కమిషనర్ రాహుల్ మీనా!
రాజమండ్రి: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న రహదారులు, ఇతర మౌలిక వసతులను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. సోమవారం ఉదయం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బాలాజీ పేట రోడ్డును ఆయన పరిశీలించారు. ఇసుక లారీలు, ఇతర భారీ వాహనాలు ప్రయాణించడం వల్ల నేల కుంగుబాటుకు గురై గుంతలు ఏర్పడుతుండటంతో.. నూతన రహదారిని నిర్మించవలసిందిగా సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రస్తుతం పనులు టెండర్ దశలో ఉన్నట్లు అధికారులు కమిషనర్ కు తెలపగా.. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి పూర్తిచేయవలసిందిగా కమిషనర్ ఆదేశించారు. అలాగే రహదారి నిర్మాణం అనంతరం ప్రజల సౌకర్యార్థం భారీ వాహనాలు రోడ్డులోకి రాకుండా బారికేడ్, సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట ఎస్ఈ రీటా, డీఈ లోవరాజు, ఇతర సిబ్బంది ఉన్నారు.




