Polavaram: ప్రారంభించిన కొద్ది గంటల్లోనే పోలవరం ఎడమ కాలువలో లీకేజీలు!
Polavaram: సిఎమ్ చంద్రబాబు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే పోలవరం ఎడమ ప్రధాన కాలువ జాయింట్ల వద్ద నీరు కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Polavaram: ప్రారంభించిన కొద్ది గంటల్లోనే పోలవరం ఎడమ కాలువలో లీకేజీలు!
Polavaram: పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను విడుదల చేసిన కొద్ది గంటల్లోనే కాలువలోని కొన్ని ప్రాంతాల్లో నీరు బయటకు వచ్చినట్లు కనిపిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కాలువ గోడలు, జాయింట్ల వద్ద నీరు కారిన ఆనవాళ్లు కనిపించడంతో.. ఈ వీడియోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
దశాబ్దాల కలగా భావిస్తున్న పోలవరం జలాలు ఉత్తరాంధ్రకు చేరిన రోజే.. కాలువలో లీకేజీ దృశ్యాలు కనిపించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఈ లీకేజీలకు కారణం ఏమిటి..?
నిర్మాణంలో లోపమా..? నీటి ప్రవాహం కారణంగా ఏర్పడిన సమస్యా..?వైరల్ అవుతున్న ఈ దృశ్యాలపై అధికారులు స్పందించి.. వాస్తవ పరిస్థితిని ప్రజలకు స్పష్టం చేయాల్సి ఉంది. గోదావరి జలాలు వచ్చాయి కానీ పోలవరం ఎడమ ప్రధాన కాలువలో కనిపిస్తున్న ఈ నీటి జాడలు వాస్తవమా.. కాదా అనేది ప్రభుత్వం, అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.




