Polavaram: ఉద్యోగ సంఘాల పోరాటాలకు ఏపీఆర్‌ఎస్‌ఏ సంపూర్ణ మద్దతు

Polavaram: రాష్ట్రస్థాయి సదస్సులో పోలవరం జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.కె ఫయాజ్ భాష (జిలాని) పాల్గొని ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Prasanna, Rampachodavaram
Published on: 28 Aug 2026 7:16 PM IST
Polavaram
X

Polavaram: ఉద్యోగ సంఘాల పోరాటాలకు ఏపీఆర్‌ఎస్‌ఏ సంపూర్ణ మద్దతు

పోలవరం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టబోయే పోరాటాలకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పోలవరం జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు అందిస్తుందని పోలవరం జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పోలవరం జిల్లా అధ్యక్షులు ఎస్.కె ఫయాజ్ భాష (జిలాని) స్పష్టం చేశారు.

శుక్రవారం విజయవాడలో ఏపీ జెఎసి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో పోలవరం జిల్లా నుండి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై జిలాని ప్రసంగించారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు కలిసి పోలవరం జిల్లాలో ఉద్యోగుల సమస్యలు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యకలాపాలు తదితర అంశాలను ఆయనకు వివరించారు.

రాష్ట్ర సదస్సులో చర్చించిన విషయాలు ఉద్యమ కార్యాచరణ అసలు జిల్లా స్థాయిలో విస్తరిస్తామని ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు డిమాండ్లు సాధనకు పోలవరం జిల్లా నుండి పూర్తి సహాయ సహకారాలు రాష్ట్ర నాయకత్వానికి అందిస్తామని చెప్పడం జరిగిందని జిలాని తెలిపారు జలాన్ని వెంట అడక్ కమిటీ సభ్యులు ఆర్ మహా లక్ష్మణరావు, ప్రదీప్, మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story