Sakinetipalli: కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: గొల్లపల్లి అమూల్య

Sakinetipalli: సఖినేటిపల్లి లంకలో టీడీపీ నాయకులు చిట్‌చాట్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గొల్లపల్లి అమూల్య తెలిపారు.

PRABHU, RAZOLE
Published on: 6 Sept 2026 5:09 PM IST
Sakinetipalli
X

Sakinetipalli: కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: గొల్లపల్లి అమూల్య

సఖినేటిపల్లి: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య అన్నారు. ఆదివారం సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంకలో టీడీపీ సీనియర్ నాయకుడు కొండా కిషోర్ నివాసంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో వారు చిట్‌చాట్ నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

వైఎస్సార్‌సీపీ పాలనకు ముగింపు పలికి ప్రజలు ఏర్పాటు చేసుకున్న కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి శ్రేణులు విజయబావుటా ఎగురవేయాలని ఆకాంక్షించారు. “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి జిల్లాలో రెండో స్థానంలో నిలిపిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story