Markapuram: రేపు మార్కాపురంలో పెద్దారవీడు మండల టీడీపీ సమావేశం!
Markapuram: బుధవారం మార్కాపురంలో పెద్దారవీడు మండల టీడీపీ నాయకుల కీలక సమావేశం జరగనుంది.
Markapuram: రేపు మార్కాపురంలో పెద్దారవీడు మండల టీడీపీ సమావేశం!
మార్కాపురం: పెద్దారవీడు మండల తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం బుధవారం (12-08-2026) ఉదయం 10 గంటలకు మార్కాపురంలో నిర్వహించనున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి తెలిపారు.
యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు.
అలాగే ఓటర్ల జాబితా ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో జరుగుతున్న మార్పులు, చేర్పులు, టీడీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న డోర్ టు డోర్ కార్యక్రమంపై కార్యాచరణ రూపొందించనున్నారు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సమావేశంలో చర్చించనున్నారు.
మండల క్లస్టర్ కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని మెట్టు శ్రీనివాసరెడ్డి కోరారు.




