Aynavilli: జనసైనికుడు బూల శ్రీనివాస్ అకాల మరణం సత్యనారాయణ సంతాపం!
Aynavilli: అయినవిల్లి మండలం నేదునూరు పెదపేటలో జనసైనికుడు బూల శ్రీనివాస్ అకాల మరణం చెందగా.. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
Aynavilli: జనసైనికుడు బూల శ్రీనివాస్ అకాల మరణం సత్యనారాయణ సంతాపం!
అయినవిల్లి: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం, నేదునూరు పెదపేట గ్రామానికి చెందిన జనసైనికుడు బూల శ్రీనివాస్ అకాల మరణం చెందడం పట్ల పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
విషయం తెలిసిన వెంటనే ఆయన బూల శ్రీనివాస్ నివాసానికి చేరుకుని, వారి పార్థివ దేహానికి పూలమాల అర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొని బుల శ్రీనివాస్ గారికి తమ నివాళులు అర్పించారు.
Next Story




