P Gannavaram: పేదలకు ఆర్థిక భరోసాయే లక్ష్యం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ!

P Gannavaram: పి. గన్నవరంలో రూ.15.88 కోట్ల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పోతవరంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.

RAJU, P GANNAVARAM
Published on: 1 Sept 2026 1:32 PM IST
P Gannavaram
X

P Gannavaram: పేదలకు ఆర్థిక భరోసాయే లక్ష్యం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ!

P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం, పోతవరం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, మత్స్యకారులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

పి. గన్నవరం నియోజకవర్గ పరిధిలో మొత్తం 37,541 మంది లబ్ధిదారులకు రూ.15.88 కోట్ల విలువైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రభుత్వం అందిస్తోందని ఎమ్మెల్యే గారు తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా లభిస్తుందని, వారి కుటుంబ అవసరాలకు ఇది ఎంతో తోడ్పాటుగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story