Rajahmundry: నిర్మాణాల నాణ్యతలో రాజీ పడొద్దు కమిషనర్ రాహుల్ మీనా!

Rajahmundry: రాజమండ్రిలో అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు ఆదేశం.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 18 Aug 2026 6:40 PM IST
Rajahmundry
X

Rajahmundry: నిర్మాణాల నాణ్యతలో రాజీ పడొద్దు కమిషనర్ రాహుల్ మీనా!

Rajahmundry: నిర్మాణ పనుల్లో రాజీపడకుండా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ, తలపెట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. వీఎల్ పురం గురుక్షేత్రం వద్ద రూ. 52 లక్షలతో నిర్మించిన రహదారితో పాటు సాయిదీపిక నగర్లో రూ. 19 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రోడ్డును పరిశీలించారు.

పనుల నాణ్యతను స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యవేక్షణ చేసే ఇంజనీర్లు పూర్తి జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. అనంతరం 9వ వార్డు కాంచన నగర్లో రూ. 47 లక్షల నిధులతో నూతన రహదారి, డ్రెయిన్ నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించారు.

రహదారి పనుల కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని.. హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు నగరపాలక సంస్థ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పర్యటనలో ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, డీఈ లోవరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story