Rampachodavaram: రంప గ్రామంలో వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ

Rampachodavaram: రంపచోడవరం రంప గ్రామంలో వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ. పాల్గొన్న ట్రస్ట్ ఇంచార్జి చిన్నం కర్నెంద్రబాబు, గ్రామస్థులు.

Prasanna, Rampachodavaram
Published on: 16 Aug 2026 2:03 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: రంప గ్రామంలో వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ

Rampachodavaram: పోలవరం జిల్లా, రంపచోడవరం మండలం, రంప గ్రామంలో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వేదాగ్ని ట్రస్ట్ అధినేత మంజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రంప గ్రామంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వేదాగ్ని ట్రస్ట్ ఇంచార్జి చిన్నం కర్నెంద్రబాబు, రంప గ్రామ పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాను ఘనంగా ఎగురవేసి జాతీయ పతాకానికి వందనం చేశారు.

అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. దేశ సమైక్యత, అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశభక్తి నినాదాల మధ్య స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story