Gokavaram: దోమల నివారణే లక్ష్యం.. గోకవరంలో హెల్త్ వర్కర్ల ప్రతిజ్ఞ

Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో జీ. కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 16 May 2026 5:07 PM IST
Gokavaram
X

Gokavaram: దోమల నివారణే లక్ష్యం.. గోకవరంలో హెల్త్ వర్కర్ల ప్రతిజ్ఞ

Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జి. కొత్తపల్లి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధి కారులు డా. తిరన్, డా. నిఖిత పర్యవేక్షణ లో మండలంలో పలు గ్రామాలలో "జాతీయ డెంగ్యూ దినోత్సవ "ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా గోకవరం నందు ప్రతిజ్ఞ మరియుప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతీఒక్క పౌరుడు ఆరోగ్యం కోసం మరియు డెంగ్యూ వ్యాధి ని నివారించేందుకు కట్టుబడి వుండాలని ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి అయ్యే ప్రదేశాలను పరిశీలించి నిల్వ లను శుభ్రపరచాలని,

వారానికి ఒకసారి నీటినిల్వలను ఖాళీ చేయాలని, పూలకుండీలు, కూలర్లు, ఫ్రిజ్ లు, టైర్లు వంటివాటిలో దోమలార్వా లు లేకుండా జాగ్రత్త పడాలని,దోమల వృద్దిని అరికట్టుటకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కుటుంభ సభ్యులకు, పొరుగు వారికి, సమాజానికి అవగాహన పెంచేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమం లో హెచ్. వి. రాజేశ్వరి,హెల్త్ అసిస్టెంట్లు పవన్, రమణ, అప్పారావు, శ్రీను టి .బి యూనిట్ నుండి దేవి, అమృత తదితరులు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story