Konaseema: రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తెలుగు టీచర్ ప్రకాశరావు!

Konaseema: కోనసీమ జిల్లాకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు జల్లి ప్రకాశరావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.

PRABHU, RAZOLE
Published on: 6 Sept 2026 5:44 PM IST
Konaseema
X

Konaseema: రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తెలుగు టీచర్ ప్రకాశరావు!

కోనసీమ: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం చెన్నడం గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు జల్లి ప్రకాశరావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. న్యూఢిల్లీలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.

తండ్రి ఉద్యోగరీత్యా అండమాన్‌కు వెళ్లిన ప్రకాశరావు అక్కడే ఉన్నత విద్యను పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో తెలుగు బోధనతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి విశేష సేవలందిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయనకు పురస్కారం లభించడంతో చెన్నడం గ్రామస్థులు, విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story