Razole: రాజోలు డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌గా ఎన్. రాజు!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొత్త వైస్ ప్రిన్సిపాల్‌గా ఇంగ్లీష్ హెచ్‌ఓడీ ఎన్. రాజు నియామకం.
Razole: రాజోలు డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌గా ఎన్. రాజు!
రాజోలు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కొత్త వైస్ ప్రిన్సిపాల్‌గా ఎన్. రాజు
రాజోలు: డాక్టర్ .బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ విభాగాధిపతి (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్)గా విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎన్. రాజు కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు.
ఇంతకుముందు వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన డా. కృష్ణమూర్తి సాధారణ బదిలీపై అమలాపురం ప్రభుత్వ కళాశాలకు వెళ్లడంతో ఈ నియామకం జరిగింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిబాబు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సహచర అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బంది శ్రీ ఎన్. రాజును ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.
శ్రీ ఎన్. రాజు మాట్లాడుతూ, కళాశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు కోసం అధ్యాపకులు, సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు.




