Mummidivaram: శాలివాహన సంఘం మండల కొత్త కమిటీ ఎన్నిక
Mummidivaram: ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనకోన మండలంలో కుమ్మర శాలివాహన సంఘం సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Mummidivaram: శాలివాహన సంఘం మండల కొత్త కమిటీ ఎన్నిక
ముమ్మిడివరం: ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనకోన మండలంలో కోనసీమ కుమ్మర శాలివాహన సేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుమ్మర శాలివాహనుల సమావేశం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాట్రేనకోన మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన మండల కమిటీ గా ఎన్నుకోబడిన వారు, మండల అధ్యక్షులుగా మాగపు శ్రీనివాస్ రావు,సెక్రటరీగా ఆకేటి కృష్ణ,ఉపాధ్యక్షులుగా ర్యాలీ మణికంఠ,గౌరవ అధ్యక్షులుగా ఆకేటి వీరభద్రుడు,మండల కమిటీ సభ్యులు ఆకేటి వీర వెంకట సత్యనారాయణ,బురద కవి శ్రీనివాస్,రాయపూడి బలబద్రం,ర్యాలీ వీరబాబు, ఆకేటి శ్రీనివాస్ లు నూతనంగా ఎన్నికైన కాట్రేనకోన మండల కమిటీ సభ్యులందరికీ కోనసీమ కుమ్మర శాలివాహన సేవ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు పులేటికుర్తి రత్నం రావు,జిల్లా సెక్రటరీ ఆదుర్తి నారాయణమూర్తి,జిల్లా గౌరవ సలహాదారులు దొడ్డిపట్ల శ్రీనివాస్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాలీ శ్రీనివాస్ వడయర్,జిల్లా గౌరవ అధ్యక్షులు వెల్ల తిరుమూర్తులు,కోనసీమ కుమ్మర శాలివాహన యూత్ ప్రెసిడెంట్ పాలకొల్లు వెంకట రమణ,అమలాపురం నియోజకవర్గం ఇన్‌చార్జి ఏడిది రమేష్ తో పాటు సంఘ నాయకులు,కుమ్మర శాలివాహన పెద్దలు,యువత తదితరులు పాల్గొన్నారు.




