Mamidikuduru: మామిడికుదురులో మొహరం సంతాప కార్యక్రమాలు ఘనంగా నిర్వహణ
Mamidikuduru: మామిడికుదురు, నగరం గ్రామాల్లో ఘనంగా మొహరం సంతాప కార్యక్రమాలు. నాలుగవ రోజు పీర్ల ఊరేగింపు నిర్వహించిన భక్తులు.
Mamidikuduru: మామిడికుదురులో మొహరం సంతాప కార్యక్రమాలు ఘనంగా నిర్వహణ
Mamidikuduru: మామిడికుదురు మండలం మామిడికుదురు,నగరం గ్రామాలలో మొహరం సంతాప కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా నాలుగవ రోజు పీర్లను ఊరేగించారు.
నగరంలోని పంజతనే పంజా, అన్సారి పంజాలలో మజిలీస్‌ల అనంతరం పీర్ల ఊరేగింపు నిర్వహించారు. అలాగే మామిడికుదురు ప్రధాన రహదారిలోని హజరత్ ఇమామ్ హుస్సేన్ పంజా, రెండో వీధిలోని ఇమామ్ హుస్సేన్ పంజా వద్ద, సర్కిల్ బాషి స్వగృహంలో మజిలీస్‌లు నిర్వహించబడ్డాయి.
మతప్రబోధకులు మహమ్మద్ ఖాజిమి నజఫీ మజిలీస్‌లలో ఇమామ్ హుస్సేన్ త్యాగాలను, కర్బలా ఘటన విశిష్టతను వివరించారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి భోజనాలను అందజేశారు.
ఈ సంతాప కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు పాల్గొని ఇమామ్ హుస్సేన్‌కు నివాళులర్పించారు.
Next Story




