Mamidikuduru: మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో 'మజలిస్ బేబీ షకీనా అజా'!
Mamidikuduru: మామిడికుదురు బీబీ షకీనా పంజాలో మొహర్రం సంతాప కార్యక్రమాలు. మజలిస్ బేబీ షకీనా అజా, కర్బలా విషాద గాథ ప్రవచనం. భారీగా తరలివచ్చిన భక్తులు.
Mamidikuduru: మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో 'మజలిస్ బేబీ షకీనా అజా'!
Mamidikuduru: మొహరం సంతాప కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు లోని బీబీ షకీనా పంజాలో మజలిస్ బేబీ షకీనా అజా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్త బృందం "గురుహై తాజ్ దారే ఒఫా" ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే "గురుహై జానిసరానే బేబీ సకీనా" భక్త బృందం ఉదయం ప్రసాదాలను పంపిణీ చేసింది.
మత ప్రబోధకులు హాఫీజ్ రజా రజ్వీ మజలిస్ నిర్వహించి, హజరత్ ఇమామ్ హుసేన్ తనయురాలు బేబీ సకీనా జీవిత చరిత్ర, కర్బలా విషాద గాథను భక్తులకు వివరించారు. ఆమె త్యాగం, సహనం, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రార్థనల్లో పాల్గొని తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. మొహరం సంతాప కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగాయి.




