Amalapuram: స్థానిక సంస్థల పోరులో కూటమి విజయమే లక్ష్యం: సానా సతీష్!

Amalapuram: అమలాపురంలో ఎంపీలు సానా సతీష్, హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో కూటమి సమన్వయ భేటీ జరిగింది.

SURESH, AMALAPURAM
Published on: 15 Sept 2026 5:35 PM IST
Amalapuram
X

Amalapuram: స్థానిక సంస్థల పోరులో కూటమి విజయమే లక్ష్యం: సానా సతీష్!

అమలాపురం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి శ్రేణుల్లో రాజకీయ సందడి నెలకొంది. రాబోయే ఎంపీటీసీ,జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని రాజ్యసభ సభ్యుడు సాన సతీష్ పిలుపునిచ్చారు.ఈ మేరకు అమలాపురంలో కూటమి ముఖ్య నేతలతో ఆయన సమావేశమై రాబోయే ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి,జనసేన పార్టీ పార్లమెంటరీ ఇన్‌చార్జి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్,బండారు శ్రీను,బీజేపీ మాజీ శాసనసభ్యుడు ఐ.ఏ.జీ.వేమా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి,జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు తదితర కూటమి నేతలు పాల్గొన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కావని, భవిష్యత్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా 2029లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా మారనున్న నేపథ్యంలో,ఇప్పటి నుంచే కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూటమి పార్టీల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని నేతలు సూచించారు.ప్రతి నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులను అంచనా వేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు,పార్టీ నాయకులు,కార్యకర్తలు సమష్టిగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సాన సతీష్ సూచించారు.ఎన్నికల్లో వ్యక్తిగత విభేదాలకు తావులేకుండా కూటమి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసి పనిచేయాలని అన్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మున్సిపాలిటీలపై కూడా కూటమి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నేతలు పేర్కొన్నారు.పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు,స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో సమిష్టి పోరాటం చేయాలని సమావేశంలో చర్చించారు. గ్రామ,మండల,జిల్లా స్థాయిలో నాయకుల మధ్య సమన్వయాన్ని పెంచి ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు

రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించే ఫలితాలు రాబోయే రాజకీయ సమీకరణాలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నందున,ప్రతి ఎన్నికను సీరియస్‌గా తీసుకుని విజయమే లక్ష్యంగా పనిచేయాలని సమావేశంలో స్పష్టం చేశారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM