Amalapuram: కోనసీమ జిల్లాలో 70 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీల పంపిణీ!

Amalapuram: కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 26 July 2026 7:31 PM IST
Amalapuram
X

Amalapuram: కోనసీమ జిల్లాలో 70 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీల పంపిణీ!

అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటానని పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్ బాలయోగి పేర్కొన్నారు.పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివ్యాంగుల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంలో తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాలు,డ్రైవింగ్ లైసెన్స్‌లు,ఇతర అర్హతలను పరిశీలించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, సూచనలు,అభిప్రాయాలను తెలుసుకున్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను కొనియాడుతూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించి కూటమి ప్రభుత్వం చేపడుతున్న విభిన్న ప్రతిభవంతుల సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి గురించి పాటు పడుతుందని తెలియజేశారు.

దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా 1,800, కోనసీమ జిల్లాలో 70 మోటరైజ్డ్ స్కూటీల పంపిణీ ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గుడిపూడి నారాయణస్వామి ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ కార్పోరేషన్ రాష్ట్ర చైర్మన్ గుడిపూడి నారాయణ స్వామి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన మాట్లాడారు.

దివ్యాంగుల స్వయం సమర్థత, ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున సుమారు 1,800 మోటరైజ్డ్ ద్విచక్ర స్కూటీలను పంపిణీ చేసిందని,అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు 10 చొప్పున మొత్తం 70 మంది దివ్యాంగులకు ఒక్కోటి సుమారు రూ.1.20 లక్షల విలువైన మోటరైజ్డ్ స్కూటీలను ఉచితంగా అందజేసినట్లు పేర్కొన్నారు.

దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా విద్య,ఉపాధి,ఉద్యోగం, వ్యాపారం తదితర రంగాల్లో స్వయం సమర్థులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు.ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం,స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు చేపట్టడం,టిడ్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపుకు ప్రాధాన్యం ఇవ్వడం,స్వయం ఉపాధి కోసం రుణాల కల్పన,రాష్ట్రవ్యాప్తంగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

అనంతరం పార్లమెంటు సభ్యులు,విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్,రామచంద్రపురం మార్కెటింగ్ యాడ్ చైర్మన్ కలిసి విభిన్న ప్రతిభావంతుల మోటార్ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.సమాజంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం పాటుపడాలి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి సమాజంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం,అభివృద్ధి కోసం పాటుపడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి తెలిపారు.ఆదివారం అమలాపురం స్థానిక అంబేద్కర్ ఫంక్షన్ హాల్లో విభిన్న ప్రతిభావంతుల మోటార్ సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమమే ధ్యేయంగా భావించి వాళ్ళ గుర్తింపు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. అదేవిధంగా ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు వాళ్లకు అందజేయాలని అధికారులకు తెలియజేశారు. వికలాంగులు మనోధైర్యం ఆత్మస్థైర్యం పెంపొందించుకుని అన్ని రంగాలలో ముందుండాలని ఆమె తెలిపారు.

ఈ స్కూటీలు దివ్యాంగుల చలనశీలతను పెంచి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వి సుబ్బారావు, ఆర్టీవో దేవి శెట్టి శ్రీనివాసరావు, రామచంద్రపురం మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంత్, తెలుగుదేశం జిల్లా కమిటీ అధ్యక్షులు గుత్తుల సాయి ప్రధాన కార్యదర్శి పల్లంరాజు, విభిన్న ప్రతిభావంతుల అసిస్టెంట్ డైరెక్టర్ & జిల్లా మేనేజర్ ఏవై శ్రీనివాస్, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ పునారవాస పునర్వాస అధికారి శ్రీరామ్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story