Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మదర్ థెరిసా జయంతి వేడుకలు!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 26 Aug 2026 12:14 PM IST
Razole
X

Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మదర్ థెరిసా జయంతి వేడుకలు!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో మథర్‌ థెరిసా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి. సాయిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి. సాయిబాబు మాట్లాడుతూ భారతదేశంలో కలకత్తా కేంద్రంగా మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ సంస్థను స్థాపించి, అభాగ్యులు, రోగులు, అనాథలకు ఆశాజ్యోతిగా మథర్‌ తెరిసా తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. మానవసేవే మాధవసేవగా భావించి సేవలందించిన ఆమెకు నోబెల్‌ శాంతి బహుమతి లభించిందని పేర్కొన్నారు.

మదర్‌ తెరిసా సేవా స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని, సమాజం పట్ల తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ నల్లి రాజు, డాక్టర్‌ లావణ్య, గోపాలకృష్ణ, చిన్న సత్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మదర్‌ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story