Rajahmundry: మదర్ థెరిస్సాను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: నాయకులు!

Rajahmundry: రాజమండ్రి మల్లయ్యపేటలో మదర్ థెరిస్సా 115వ జయంతి వేడుకలను డాక్టర్ రాజశేఖర్ ఘనంగా నిర్వహించారు. పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 26 Aug 2026 4:15 PM IST
Rajahmundry
X

Rajahmundry: మదర్ థెరిస్సాను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: నాయకులు!

రాజమండ్రి: అమృత మూర్తి, నోబెల్ శాంతి బహుమతీ గ్రహీత, భారతరత్న మదర్ ధెరిస్సా 115వ జయంతి వేడుకలను స్థానిక మల్లయ్యపేట జంక్షన్‌లో మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాలాబత్తుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

మల్లయ్యపేటలో ఆయన ప్రతిష్టించిన విగ్రహానికి కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, వైసిపి నాయకురాలు ఆచంట మారుతీ దేవి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు తాడి సూరిబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చి సేవే మార్గంగా ఎంచుకుని ఇక్కడ కుష్టురోగులు, అనాధలు, అభాగ్యుల పాలిట దైవంగా మారి ఆమె విశేష రీతిలో సేవలందించారని కొనియాడారు.

నేటి సమాజంలో అటువంటి వ్యక్తులు, నాయకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో అనే ప్రాంతాల్లో శరణాలయాలను స్థాపించి మంచి సేవలు అందించి శాంతి దూతగా పేరు ప్రతిష్టలు పొందారన్నారు. ఆమె సేవలు మెచ్చి భారతదేశ అత్యున్నత పురస్కారం భారత రత్న కూడా ఇచ్చారన్నారు. ప్రపంచ శాంతి దూతగా నోబెల్ బహుమతిని కూడా అందుకున్నారని ప్రశంసించారు. పోప్ జాన్ పాల్ కూడా మదర్ థెరిస్సా సేవలను కొనియాడారని గుర్తు చేసారు. నేటి యువత, రాజకీయ నాయకులు ఆమెను ఆదర్శంగా తీసుకుని సేవాభావంతో ముందుకు సాగాలని కోరారు.

డాక్టర్ రాజశేఖర్ ప్రతీ ఏటా మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా స్థానిక చీరలు, స్వీట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆచంట మారుతీదేవికి చిరు సత్కారం చేసారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు డాక్టర్ విజయభాస్కర్, జి.దత్తు, కట్టా అశోక్‌కుమార్, కుంచే వెంకట రమణ, దుప్పాటం సుధాకర్, జి.సురేష్ ప్రసాద్, కె.రాజ్‌కుమార్, పి.హేమంత్, కె.రేణుక, జి.పార్ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story