Razole: మామిడికుదురులో భక్తిశ్రద్ధలతో మొహరం సంతాప కార్యక్రమాలు!

Razole: అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు, నగరం గ్రామాల్లో ఘనంగా మొహరం సంతాప కార్యక్రమాలు.

PRABHU, RAZOLE
Published on: 18 Jun 2026 12:24 PM IST
Razole
X

Razole: మామిడికుదురులో భక్తిశ్రద్ధలతో మొహరం సంతాప కార్యక్రమాలు!

రాజోలు: డాక్టర్. బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు, నగరం గ్రామాలలో మొహరం సంతాప కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా హజరత్ అబ్బాస్ పంజాలో మజిలీస్ నిర్వహించారు. ప్రబోధకులు మొహమ్మద్ ఖాజిమి కర్బలా విషాద సంఘటనలను భక్తులకు వివరించారు.

కర్బలా చరిత్రలో హజరత్ అబ్బాస్ పోషించిన విశిష్ట పాత్రను మజిలీస్ రూపంలో వివరించిన ఆయన, కర్బలా యుద్ధంలో సైన్యాధిపతిగా హజరత్ అబ్బాస్ చేసిన త్యాగాలను కొనియాడారు. కర్బలా సంఘటనకు సంబంధించి అమరజీవిగా హజరత్ అబ్బాస్‌ను అభివర్ణించారు.

మజిలీస్ కార్యక్రమాలకు వందలాది మంది భక్తులు హాజరుకాగా, నిర్వాహకులు వారికి తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే బడే బేబీ పంజా, జైనుల్ ఆబెదిన్ పంజా వద్ద కూడా మజిలీస్ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పీరును ఊరేగింపుగా తీసుకెళ్లి మొహరం సంతాప కార్యక్రమాలను నిర్వహించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story