Mamidikuduru: పాశర్లపూడి దర్గాలో భక్తిశ్రద్ధలతో మొహర్రం మజిలీస్

Mamidikuduru: మామిడికుదురు మండలం పాశర్లపూడి ఫాతిమా బిబి దర్గాలో మొహర్రం సంతాప కార్యక్రమాలు. మజిలీస్ ప్రసంగం విని భావోద్వేగానికి లోనైన భక్తులు.

PRABHU, RAZOLE
Published on: 30 Jun 2026 8:33 AM IST
Mamidikuduru
X

Mamidikuduru: పాశర్లపూడి దర్గాలో భక్తిశ్రద్ధలతో మొహర్రం మజిలీస్

మామిడికుదురు: మొహర్రం సంతాప కార్యక్రమాల్లో భాగంగా మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామంలోని ఫాతిమా బిబి దర్గాలో సోమవారం మజిలీస్ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మర్సియా ఆలపిస్తూ కర్బలా వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

మత ప్రబోధకులు మొహమ్మద్ కాజ్మీ నజఫి కర్బలా యుద్ధంలోని విషాద ఘటనలు, హజరత్ ఇమామ్ హుస్సేన్ (అ.స.) మరియు వారి పవిత్ర పరివారం అనుభవించిన కష్టాలు, త్యాగాలను హృదయాన్ని కదిలించేలా వివరించారు. ఆయన ప్రసంగాన్ని ఆలకించిన భక్తులు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రాచీన దర్గాగా పేరొందిన ఫాతిమా బిబి దర్గాలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాతం నిర్వహించి హజరత్ ఫాతిమా జహ్రా (స.అ.)కు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొహర్రం సంతాప కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story