Konaseema: ప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి కళ్యాణోత్సవ శుభపత్రిక ఆవిష్కరణ!
Konaseema: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి దేవస్థానం తిరు కళ్యాణ మహోత్సవములు-2026 ఆహ్వాన శుభపత్రికను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు.
Konaseema: ప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి కళ్యాణోత్సవ శుభపత్రిక ఆవిష్కరణ!
కోనసీమ: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం ఎమ్మెల్యే క్యాంపు వారి కార్యాలయంలో శ్రీ బాల బాలాజీ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న తిరు కళ్యాణ మహోత్సవములు–2026 ఆహ్వాన శుభపత్రికను పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, “తిరుమలకు వెళ్లలేని భక్తుల కోసం సాక్షాత్తు శ్రీనివాసుడే తరలివచ్చిన పుణ్యక్షేత్రం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ క్షేత్రం. ఈ తిరు కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని ప్రతి భక్తునికి విజ్ఞప్తి చేస్తున్నాను” అని అన్నారు.
ఈ ఆహ్వాన శుభపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో కూటమి నాయకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, దేవస్థాన ప్రతినిధులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.




