P Gannavaram: పి. గన్నవరంలో ‘స్వర్ణ నియోజకవర్గం’ విజన్ యూనిట్ ప్రారంభం!
P Gannavaram: పి. గన్నవరంలో ‘స్వర్ణ నియోజకవర్గం విజన్ & యాక్షన్ ప్లాన్ యూనిట్’ ఆఫీస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. స్వర్ణాంధ్ర 2047 దిశగా ప్రణాళికలు.
P Gannavaram: పి. గన్నవరంలో ‘స్వర్ణ నియోజకవర్గం’ విజన్ యూనిట్ ప్రారంభం!
P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ నియోజకవర్గం విజన్ & యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో “స్వర్ణాంధ్ర @ 2047” లక్ష్య సాధనలో పి. గన్నవరం నియోజకవర్గాన్ని ముందంజలో నిలపడం విజన్ యూనిట్ ప్రధాన లక్ష్యమన్నారు.
నియోజకవర్గంలోని అభివృద్ధి లోటుపాట్లను గుర్తించి, డేటా ఆధారంగా ప్రణాళికలు రూపొందించడం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగడం ఈ యూనిట్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
వ్యవసాయం, ఆక్వా, పరిశ్రమలు, MSMEలు, సేవారంగం, మౌలిక వసతులు, యువతకు నైపుణ్యాలు–ఉపాధి, ప్రజా సేవలు వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి సంవత్సరం 15 శాతానికి పైగా స్థిరమైన వృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
“డేటా ఆధారిత ప్రణాళిక – సమర్థవంతమైన అమలు – నిరంతర పర్యవేక్షణ – ప్రజల భాగస్వామ్యం – 15%కు పైగా స్థిరమైన వృద్ధి” అనే లక్ష్యంతో పి. గన్నవరం నియోజకవర్గాన్ని స్వర్ణాంధ్ర @ 2047కు ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు




